గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం.. - వరంగల్ జడ్పి చైర్ పర్సన్  గండ్ర జ్యోతి

గ్రామాల అభివృద్దే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం.. - వరంగల్ జడ్పి చైర్ పర్సన్  గండ్ర జ్యోతి

ముద్ర, శాయంపేట : శాయంపేట మండలం నరసింహులపల్లి , గట్ల కనిపర్తి, సూరంపేట, కొత్తగట్టు సింగారం గ్రామాల్లో  వరంగల్ జడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు.
ఈ యాత్రలో గండ్ర జ్యోతి  మాట్లాడుతూ   దేశంలో ఎక్కడలేని విధంగా రైతుకు రైతు బంధు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు ఎట్లుండే ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజలు గమనించాలి.
గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఎవరు అడగలేకపోయిన వృద్దులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేసారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయా ఆధారిత నీరు అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 
మోటార్లకు మీటర్లు పెడుతా అంటున్న బీజేపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
భూపాలపల్లి నియోజకవర్గం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం.
పాపం అంటే మల్లి వెనక్కి పోతాం.
కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పథకాలను ప్రజలు అర్థం చేసుకోవాలి.
 ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా ద్వారా 15లక్షల వరకు ఆరోగ్య భీమా కలిస్తుంది
 1200 ఉన్న గ్యాస్ ధరలను తగ్గించి కేవలం 400లకే గ్యాస్ అందిస్తుంది.
సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు ప్రతి నెల 3000 ఆర్థిక సహాయం అందిస్తుంది.
3016 ఉన్న ఆసరా పెన్షన్ ప్రతి ఏటా 500 పెంచుతూ 5016వరకు అందిస్తుంది,4016ఉన్న వికలాంగుల పెన్షన్ 6016 అందిస్తుంది.
 ఎన్నికలు రాగానే నాయకులు వస్తుంటారు ఒక్కసారి ప్రజలు వారిని ప్రశ్నించాలని చెప్పారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వీరి  వెంట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ మండల వైస్ ఎంపీపీ వంగాల నారాయణ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, పిఏసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్, పత్తిపాక గ్రామ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.