ఆలేరు అభివృద్ధి కోసం నిరంతర కృషి.. ప్రభుత్వ విప్ సునీత వెల్లడి..

ఆలేరు అభివృద్ధి కోసం నిరంతర కృషి..  ప్రభుత్వ విప్ సునీత వెల్లడి..

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు మున్సిపల్ కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చెప్పారు. శనివారం నాడు ఆలేరు పట్టణ కేంద్రంలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సభకు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అధ్యక్షత వహించగా ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయితీగా ఉన్న ఆలేరును మున్సిపల్ కేంద్రంగా ఏర్పాటు చేసి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆలేరు పట్టణంలోని అన్ని వార్డులలో సిసి రోడ్ల నిర్మాణంతోపాటు మురుగు కాల్వల నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగిస్తున్నట్లు వివరించారు. పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మున్సిపల్ పాలకవర్గాన్ని ఆమె అభినందించారు. పట్టణాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి. మెప్పించి మరిన్ని నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్. కౌన్సిలర్లు చింతలపని సునీత శ్రీనివాసరెడ్డి. ఎర్ర దయామని దేవదానం. బేబీ రాములు. గుత్త శమంత సీతారాం రెడ్డి. సంగు భూపతి. రాయపురం నరసింహులు. మోర్తాల సునీత రమణారెడ్డి. దాసి నాగమణి సంతోష్. కందుల శ్రీకాంత్. జూకంటి శ్రీకాంత్. మున్సిపల్ కమిషనర్ చక్రపాణి. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సీసా ప్రవీణ్. ఎండి రియాజ్. బింగి లత రవి తో పాటు మున్సిపల్ మేనేజర్. సిబ్బంది. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్. జిల్లా ఆర్టిఏ సభ్యులు పంతం కృష్ణ. జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడేపు బాలస్వామి. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. ఆత్మ చైర్మన్ జల్లి నరసింహులు. నాయకులు దయ్యాల సంపత్. జూకంటి వెంకటేష్. ఉప్పలయ్య. సరాబ్ సంతోష్ కుమార్. కుతాటీ అంజన్ కుమార్. మందుల విజయ కృష్ణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.....