రెవెన్యూ డివిజన్ హామీని నెరవేర్చాలి.. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు..

రెవెన్యూ డివిజన్ హామీని నెరవేర్చాలి.. ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకులు..

ఆలేరు (ముద్ర న్యూస్): ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాట్లు చేస్తున్నట్లు గతంలో పట్టణ కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రకటించిన హామీని నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టి పి సి సి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని హర్వతలు ఉన్నప్పటికీ ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో గతంలో చేసిన డిమాండ్ల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రెవెన్యూ డివిజన్ కేంద్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ప్రకటించిన ఎమ్మెల్యే ఇటీవల అనేక కొత్త రెవిన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసి జీవోలు విడుదల చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్ కోసం ప్రభుత్వం పై ఒత్తిడి చేసి సాధించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అఖిలపక్ష కమిటీ ఆందోళనతో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజ్ వెంకటేశ్వరరాజు. మున్సిపల్ కౌన్సిలర్ చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి. నాయకులు కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి. ఎంఏ ఏజాజ్. ఉప్పలయ్య. సిరిగిరి విద్యాసాగర్. మల్లెల శ్రీకాంత్. లత. లలిత. దశరథ తో పాటు తదితరులు పాల్గొన్నారు....