స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తా - మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ బీజేపీకి రాజీనామా

స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తా - మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ బీజేపీకి రాజీనామా

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిజెపి పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన గోదావరిఖనిలోని తన  నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రామగుండం  ఎమ్మెల్యే గెలుపు పొందుతానని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.  రామగుండం మొదటి మున్సిపల్ మేయర్ గా ఎమ్మెల్యేగా రామగుండం ప్రజలు నన్ను ఆశీర్వదించారని ఇప్పుడు కూడా రామగుండం ప్రజల ఆశీర్వాదంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.