దగ్ధమవుతున్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం

దగ్ధమవుతున్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయం
  • మంటల వ్యాప్తితో పక్క దుకాణ దారుల ఆందోళన
  • శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ లోని   టవర్ సమీపంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఉదృతంగా మంటలెగిసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సర్వీస్  సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికింకా మంటలు అదుపులోకి రాలేదు.

పక్కనున్న వాణిజ్య సముదాయానికి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళనకు  గురవుతున్నారు. అసలు అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా? మరి ఏమైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  విచారణ చేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.