గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ లో చేరిన చీకురాయి యువకులు

గొట్టిముక్కుల సురేష్ రెడ్డి  ఆధ్వర్యంలో బీజేపీ లో చేరిన చీకురాయి యువకులు

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి నివాసంలో  పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన జక్కుల శ్రీకాంత్ ఆద్వర్యంలో యువకులు జక్కుల వినయ్, గుండేటి మహేష్, జక్కుల భాస్కర్, పెంచాల రాము, పెంచాల ఆంజనేయులు, రాచకట్ల రమేష్, పుదరి అన్వేష్, జక్కుల శ్రీనివాస్ లతోపాటు యువకులు బీజేపీ పార్టీలో చేరారు.

ఈసందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ  ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీలో చేరుగతున్నారని, తెలంగాణలో రాబోయేది డబల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వమేనని , తెలంగాణ అభివృద్ధి డబల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని సురేష్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి డివైడర్ మధ్యలో చెట్లు పెట్టి దానినే అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని, నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తోందన్నారు. 

రేపు పెద్దపల్లి లో మంత్రి కేటీఆర్ ని అడ్డుకుంటామని ఏ మొహం పెట్టుకొని పెద్దపల్లికి వస్తాన్నడని, రాబోయే ఎన్నికల్లో ప్రజాగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు గురికాక తప్పదని సురేష్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందునూరి ప్రమోద్ రావు, లింగంపల్లి కరుణాకర్, శనాగొండ సంపత్ చారి, సయ్యద్ ఫయాజ్, వైద తిరుపతి, గుమ్మడి లక్ష్మణ్, రేండ్ల వేణు, రాజినీకర్ రెడ్డి,యాతం అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.