హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు  సహించేది లేదు

హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు  సహించేది లేదు

ముద్ర, హుజురాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును తక్షణమే బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని  హుజురాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం  పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  స్వార్థం కోసం మైనంపల్లి మెదక్ జిల్లా స్థానాన్ని తన కుటుంబ సభ్యులకు కావాలని అడగగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పాత వారికే కేటాయించడం జరిగిందని  తెలిపారు. 

కానీ మైనంపల్లి హనుమంతరావు కుట్రబుద్ధితో హరీష్ రావు పై అనవసర ఆరోపణలు  చేస్తున్నారన్నారు. మంత్రి హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ సంగెం ఐలయ్య, సీనియర్ నాయకుడు పోరెడ్డి దయాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి, కెసిఆర్ సేవాదళం పట్టణ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.