తెలంగాణ లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం- మేయర్ యాదగిరి సునీల్ రావు

తెలంగాణ లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం- మేయర్ యాదగిరి సునీల్ రావు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో సర్వ మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తుంది అని మేయర్ వై సునీల్ రావు అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మంగళవారం మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 33 వ డివిజన్ భగత్ నగర్ లో పెద్దమ్మ టెంపుల్ దేవాలయ సమీపంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ పండగ కానుకలను ముస్లిం మహిళలకు పంపిణీ చేశారు.  రంజాన్ పండగ వేడుకలను ఆనంధోత్సవాల మద్య జరుపుకోవాలని లడించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు  కూడా  తెలంగాణ ప్రాంతంలో జరిగే పండగలను గుర్తించి ప్రజలకు కానుకలు అందించిన దాఖాలాలు లేదన్నారు. అన్ని మతాల పండుగలకు కానుకలు అందించే సంస్కృతి కి కెసిఆర్ శ్రీకారం చుట్టారని వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగలకు మహిళలకు చీరలు, రంజాన్ పండగ కు ముస్లింలకు తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందించడం జరుగుతుందని తెలిపారు.  కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పండగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినా పంగలను గుర్తించి కానుకలు ఇవ్వలేదని ప్రజలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి పండగకు నిండు మనస్సుతో దీవెనలు అందిస్తున్నారని తెలిపారు.  నగరంలో 60 డివిజన్ లలో పేద మైనార్టి ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ఈద్గల్లో పరిశుభ్రత పనులతో పాటు కావల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. పేద ముస్లిం ప్రజలకు ప్రత్యేకంగా షాదీముబారాక్ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు 1 లక్ష 116 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.  ప్రజల సంక్షేమం కోరే  ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ సల్ల శారద రవీందర్, బీఆర్ఎస్ నాయకులు హామీద్, సంజయ్, పండగ నాగరాజు, కుంభం అనిల్ తదితరులు పాల్గొన్నారు.