కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

సైదాపూర్ ముద్ర.సైదాపూర్ మండల పరిధిలోని 16 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్య పొడితెల సతీష్ కుమార్ లబ్ధిదారులకు16 లక్షల 1856 రూపాయల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు ఇప్పటివరకు సైదాపూర్ మండలానికి మండలంలో అన్ని గ్రామాలలో 1268 మంది కళ్యాణ లక్ష్మి షాదిముబారక్.లబ్ధిదారులకు 11 కోట్ల 98 లక్షల 20 వేల708 రూపాయలను ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది.
అనంతరం 9 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైనా 1లక్ష 67 వేల 500 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశార అంతకముందు
వెన్కేపల్లి గ్రామంలో తుమ్మల చెరువు నుండి పోలుకమ్మ చెరువు వరకు 19 లక్షల 80 వేల రూపాయలతో చేపడుతున్న కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి. అనంతరం.మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం అధ్వర్యంలో వీర్లబండ వద్ద మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. 
ఆసరా ఫింఛ‌న్‌ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి తాసిల్దార్ బావుసింగ్ పీఏసీ చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి బిర్లా వెంకట్ రెడ్డి వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు