కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు

కార్మికుల సమ్మెకు బిజెపి మద్దతు

శంకరపట్నం ,ముద్ర జూలై 14 : గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు, రాష్ట్ర నాయకుడు, సొల్లు అజయ్ వర్మ ప్రకటించారు. శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా గ్రామపంచాయతి కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరింది. నాగరాజు, అజయ్ వర్మలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను చులకనగా చూస్తుందని వారన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని, వారి డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్,జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్,అంతం రాజిరెడ్డి. సీనియర్ నాయకులు దండు కొమురయ్య,  దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్,దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దసరపు నరేందర్,మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి,శ్రీనివాస్,మండల ఎస్టి మోర్చా అధ్యక్షులు సారయ్య, సాగర్,ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి రంజిత్,ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి లోకిని కుమారస్వామి,గొల్లపల్లి శ్రీనివాస్,శివారెడ్డి,సాయి,కుమార్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.