హస్తం గూటికి 20 మంది  - దేవుని గుట్ట తండాలో కాంగ్రెస్ లో చేరిన గిరిజనులు

హస్తం గూటికి 20 మంది  - దేవుని గుట్ట తండాలో కాంగ్రెస్ లో చేరిన గిరిజనులు

ముద్ర,ఎల్లారెడ్డిపేట :-ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి దేవుని గుట్ట తండాలో 20 మంది గిరిజన యువకులు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవుని గుట్ట తండాలో జెండా ఆవిష్కరణ అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తండా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను అక్కున చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హయాం నుండి ఇప్పటివరకు గిరిజనులకు ఆదుకుంటున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్రపడిందన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు పోడు భూముల పట్టాలు అడవిపైన హక్కులను కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు.ప్రస్తుత బిఆర్ఎస్  ప్రభుత్వం గిరిజనుల నుండి వారి భూములను లాక్కోవడం కేసులు పెట్టి జేల్లలో  వేయడం జరుగుతుందన్నారు. సింగారం గ్రామంలో జెండా ఆవిష్కరణ చేశారు. రాజన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శేఖర్ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకుడు వారి పెళ్లి సంజీవరెడ్డి తండ్రి చనిపోగా వారిని కూడా పరామర్శించారు.ఈ కార్యక్రమాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,  నాయకులు కొత్తపల్లి దేవయ్య, సూడిద రాజేందర్,  గుర్రం రాములు, ఎండి హిమాం ,బాలు యాదవ్, రమేష్ ,శ్రీకాంత్ రెడ్డి, ఎల్లాగౌడ్, హైమద్  నవీన్ నాయక్  శ్రీనివాస్ గౌడ్,ఎస్కే గఫార్, దేవయ్య  తదితరులు పాల్గొన్నారు.