జాతీయ అవార్డు గ్రహీత ముత్యాలకు సన్మానం - మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 

జాతీయ అవార్డు గ్రహీత ముత్యాలకు సన్మానం - మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : జాతీయ అవార్డు గ్రహీత ముత్యాల ప్రభాకర్ రెడ్డికి బుధవారం సన్మానం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముత్యాల ప్రభాకర్ రెడ్డి కి ఫోటో రంగంలో ఇటీవల తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో  జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మండల రెడ్డి సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర,జాతీయ స్థాయిలో  వివిధ రంగాలలో ఫోటోలు తీసి ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్నందుకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి సభ్యులు వంగ గిరిధర్ రెడ్డి, ముడుసు సాయిరెడ్డి, మోతే లక్ష్మారెడ్డి,ప్రవీణ్ రెడ్డి,జంక ఆరుట్ల సత్యం రెడ్డి,ముచ్చట తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.