రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి. సీ ఐ లక్ష్మి నారాయణ

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి. సీ ఐ లక్ష్మి నారాయణ

మెట్‌పల్లి ముద్ర:- ఖరీఫ్ సీజన్ లో పంటలు వేయడానికి సిద్దం అవుతున్న రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని. సీ ఐ లక్ష్మీనారాయణ విత్తనాల దుకాణ యజమానులకు సూచించారు. సోమవారం మండల వ్యవసాయాధికారి సాహిత్ అలీ తో కలసి విత్తన దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విక్రయించిన ప్రతి కంపెనీ పేరు రిజిస్టర్ లో నమోదు చేసి రైతుకు రిసిప్ట్ ఇవ్వాలన్నారు. ఎస్ ఐ లు శ్యామ్ రాజ్, మన్మధ రావు, సిబ్బంది ఉన్నారు.