కాంగ్రెస్ టికెట్ కోసం కోమటిరెడ్డి దరఖాస్తు

కాంగ్రెస్ టికెట్ కోసం కోమటిరెడ్డి దరఖాస్తు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ తనకు కేటాయించాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు దరఖాస్తు ఫారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తను పడుతున్న కష్టాన్ని  పార్టీ గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.గత ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పని చేస్తున్నానని తెలిపారు.  గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పడికప్పుడు ఎండగడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నానని తెలిపారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న  నాకు పార్టీ తప్పకుండా టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.