ఎమ్మెల్యే దత్తత గ్రామంలో పల్లె నిద్ర చేసిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో పల్లె నిద్ర చేసిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

 గోడు వెళ్లబోసుకున్న గ్రామస్థులు

సైదాపూర్.ముద్ర: మండలం లోని ఎలబోతారం గ్రామంలో మన ఊరికి పల్లె నిద్రలో భాగంగ బీజేపీ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె నిద్ర కార్యక్రమానికి వచ్చిన జెఎస్ఆర్  కి గ్రామస్థులు,మహిళలు,గ్రామ యువకులు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు వారు పడుతున్న సమస్యను, ఇబ్బందులను జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి  దృష్టి కి తీసుకెళ్లడం జరిగింది, అనంతరం గ్రామస్థులతో సహపక్తి భోజనం చేసి గ్రామంలో నిద్రించడం జరిగింది.

ఉదయం 6:00 గంటల నుండి గ్రామంలో పలు కాలనీల్లో పర్యటించి గ్రామస్తులను ఉద్దేశించి  సురేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఅర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని,గ్రామ సమస్యలు తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు, ఎమ్మెల్యే దత్తత గ్రామంలో పరిస్థితి ఇలా వుంటే నియోజకవర్గంలోని పరిస్థితినీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వారు అన్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, దళిత బందు, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు.స్థానికేతరుడైన ఇక్కడి ప్రజలు రెండుసార్లు ఓట్లు వేసి గెలిపిస్తే ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

ఎలబోతరాం గ్రామంలో నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు 2017వ సంవత్సరం అక్టోబర్ లో  ప్రారంభోత్సవం చేసిఇప్పటికీ ఇంకాపూర్తి కాలేదని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా వుంది అని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు పశువుల పాకగా మారాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,రాయికల్ సర్పంచ్ మధుకర్ రెడ్డి,ఎంపీటీసీ జెళ్ల మల్లేశం,కో ఆపరేటివ్ డైరెక్టర్  ప్రవీణ్ రావు,మాధవరెడ్డి,శ్రీనివాస్,శ్రీనివాస్,మధుకర్,నవున్ రెడ్డి,ప్రక్ష్ రెడ్డి,bసత్యం, గోపాల్రెడ్డి,సంతోష్, మహేష్,వేణు,ప్రవీణ్,సురేష్, అనిరుద్,మనోహర్,శ్రీకాంత్,శ్రీను,దినేష్, పవన్,కిషోర్, సాగర్,  రాజు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు