జ్యోతిష్మతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఉద్యమం

జ్యోతిష్మతి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఉద్యమం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల , జ్యోతిష్మతి జాతీయ సేవా పథకం(NSS CELL)- జ్యోతిష్మతి బ్రిగేడ్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కోర్టు చౌరస్తా నుండి  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 10 డివిజన్లలో  మూడవ ఫేజ్ ప్లాస్టిక్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కోర్టుచౌరస్తాలో ఏర్పాటుచేసిన  కార్యక్రమంలో  కార్పొరేటర్లు బండ సుమ, జంగిలి సాగర్, భూమా గౌడ్ లు ముఖ్య అతితులు గా పాల్గోని మాట్లాడారు. జ్యోతిష్మతి ఆటానమస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో ముందు ఉండడాన్ని వారు అభినందించారు.  ప్లాస్టిక్ వాడడం వల్ల వచ్చే అనర్ధాలను ప్రజలకు వివరించడం ద్వారా వాటి నష్టాలను అరికట్టవచ్చునని  తెలిపారు. స్వీయ నియంత్రణను పాటించి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ను ఎక్కడ పడితే అక్కడ పడవేయడం ద్వారా మూగజీవాలు తిని చనిపోతున్నాయని, జలరాసుల్లో పడవేయడం ద్వారా చేపలు మొదలగు జంతువులు చనిపోతున్నాయని తెలిపారు. తద్వారా మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ ను పడవేయడంతో రోగాలు వ్యాప్తి చెందుతాయని వారు తెలిపారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని వాడడం తగ్గించాలని బట్ట సంచులను, పేపర్ సంచులను వాడడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టవచ్చునని తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రం స్మార్ట్ సిటీగా అవతరించినందున ప్రజలందరూ కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని వాడకుండా, ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పడవేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. 

కార్పొరేటర్లు రమణారెడ్డి ,కచ్చు రవి  తమ డివిజన్లలో విద్యార్థులు చేస్తున్నటువంటి ప్లాస్టిక్ కార్యక్రమాన్ని చూసి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వారిని ప్రోత్సహించారు. నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా చేయాలని పిలుపునిచ్చారు.కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు నేతృత్వంలో ఈ ప్లాస్టిక్ ఉద్యమాన్ని చేస్తున్నామని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ప్లాస్టిక్ వాడవద్దని జాగృతం చేస్తున్నామని జ్యోతిష్మతి కళాశాల ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్  విశ్వ ప్రకాష్ బాబు , కళాశాల ఇన్చార్జి తోట ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో  డిప్లమో ఇంచార్జ్ సి.హెచ్ .సజన్ రావు, ఫిజికల్ డైరెక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్లు డాక్టర్ గడ్డం శ్రీధర్ ,డాక్టర్ మణికండన్, డాక్టర్ జగదీషన్, డాక్టర్ వెంకటేశ్వరన్ , డాక్టర్ దావా శ్రీనివాస్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ శ్రీలత, మాధవరావు, వెంకటేశ్వర్లు, డాక్టర్ పబ్బా పరమేశ్వర్, ఉదయ్ ప్రకాష్ , జగదీశ్వర్ , యస్.గోపాల్ రెడ్డి,సతీష్ చంద్ర, రామకృష్ణ, వెంకటేశ్వర్లు,చంద్రశేఖర్, రాజ్ కుమార్ , రమ్య వీణ, సాయి కృష్ణ లతోపాటు అధ్యాపకులు,వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.