మృతుడి కుటుంబానికి పరామర్శ

మృతుడి కుటుంబానికి పరామర్శ

ముద్ర, హుజురాబాద్: మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామంలో మాజీ వార్డ్ మెంబెర్ మారెపల్లి వీరస్వామి,మంద శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా శనివారం బిఆర్ఎస్ నాయకులు వొడితల ప్రణవ్ పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈయన వెంట సర్పంచ్ పాకాల లక్ష్మారెడ్డి,ఉపసర్పంచ్ సాంబయ్య,మాజీ సర్పంచ్ చిలుముల సత్తయ్య, నిమ్మ రాజయ్య,యూత్ నాయకులు అనిల్ రెడ్డి,శ్రీకాంత్,నాగరాజు,అశోక్,రాజ్ కుమార్,సాయి క్రిష్ణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.