తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్ర ఆవిష్కరణ

తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్ర ఆవిష్కరణ

ముద్ర, జమ్మికుంట: తెలంగాణ రైతు సంఘం వీణవంక మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ జూన్ 15, 16, 17, తేదీలలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు మూడు రోజులపాటు కరీంనగర్ లోని ముకుందల్లాలు మిశ్రా భవన్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న ధరణి పోర్టల్ కనీసం మద్దతు ధరల చట్ట అమలు చేయాలని,  రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఒక లక్ష రూపాయల రుణమాఫీ తక్షణమే మాఫీ చేయాలి.

 రైతాంగానికి సబ్సిడీ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలని, పలు సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ రైతు సంఘం అని అన్నారు. ఈ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల విజయవంత నీకై   రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జునూతుల జనార్దన్ రెడ్డి, దాసరి మొండయ్య, కీర్తి శివ, మల్లేష్, సాగర్, రామచంద్రం, లక్ష్మణ్, రాజు, నారాయణరెడ్డి, నాగరాజు, జంపయ్యలు పాల్గొన్నారు.