మేడిగడ్డ ముంపు భూములకు పరిహారమమేది?

మేడిగడ్డ ముంపు భూములకు పరిహారమమేది?

మహాదేవపూర్, ముద్ర: మండలంలోని సూరారం, బెగుళూరు, బ్రాహ్మణపళ్లి, బొమ్మపూర్, మహాదేవపూర్, ఎడపల్లి, కుదురుపల్లి, బీరసాగర్ గ్రామాలలో మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా 300 ఎకరాలు గురి అవుతున్నాయి. రెండు సంవత్సరాలుగా అధికారులు కాలయాపన చేస్తున్నారని, ఇట్టి భూములకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముంపు రైతుల సంఘం నాయకులు ఎనమండ్ర వామన్ రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వీటికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు 100 మీటర్ల ఎత్తున బ్యారేజీలో నీరును నిలువ చేయడానికి నిర్ణయం తీసుకున్నందున వారికి సుమారు 300 ఎకరాలు భూసేకరణ చేయవలసిన  అవసరం ఏర్పడింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ముంపు గట్లను నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు ఇట్టి భూమిని సర్వే చేసి 300 ఎకరాలలో ఉన్న రైతులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రతి వర్షాకాలంలో ఈ భూములు మునిగిపోతుండటంతో రైతులు పంటలు వేసుకోకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు వెంటనే ఇట్టి భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకుడు ఎనమండ్ర వామన్ రావు డిమాండ్ చేస్తున్నారు.