శిశుమందిర్‌ కు 5లక్షల విరాళం

శిశుమందిర్‌ కు 5లక్షల విరాళం

 ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో నిర్మిస్తున్న నూతన భవనంలో కుమారుడు పిన్నింటి మణికంఠ నిఖిల్‌ రెడ్డి జ్ఞాపకార్ధం ఒక గది నిర్మించడానికి అతడి తల్లిదండ్రులు పిన్నింటి ఇంద్ర కరుణాకర్‌ రెడ్డి ఆదివారం 5లక్షలను విరాళంగా అందజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటి అధ్యక్షులు బల్మూరి కరుణాకర్‌ రావు, కార్యదర్శి ఇంజనీర్‌ కోల అన్నారెడ్డి, సమితి అధ్యక్షులు డాక్టర్‌ రమణాచారి, రజనీ ప్రియ, విభాగ్‌ కార్యదర్శి మేచినేని దేవేందర్‌ రావు, సంక్షేమ ట్రస్ట్‌ నిర్వహకులు రాజిరెడ్డి, పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, పూర్వ విద్యార్ధి విశ్వనాథ్‌ వినోద్‌ పాల్గోన్నారు.