రైతును రాజు చేసింది కేసీఆర్

రైతును రాజు చేసింది కేసీఆర్

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలోని రైతు వేదిక లో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైతును రాజుల బతికేలా చేసింది కేసీఆర్ అని తెలిపారు .ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్ట శక్తులు ఎన్ని వచ్చిన రైతులను కాపాడుకునే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతే రాజు అన్న ముఖ్యమంత్రి గురించి ఆలోచించాలన్నారు. రైతులందరూ రాత్రులంతా కరెంటు కోసం పడిగాపులు కాసిన రోజులు చూసామని, 2021 నాడు కరెంటు కోసం ఉద్యమం ఎత్తుకున్నది కేసీఆర్ అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మూడు గంటల కరెంట్ కావాలా, మత పిచ్చి లేపే బిజెపి ప్రభుత్వం కావాలా, మూడు పంటల ప్రభుత్వం కావాలా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హుజురాబాద్ నియోజకవర్గనికి లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఆసరా పెన్షన్ ఇతర పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.