వోరుగంటి జన్మదినం సందర్భంగా యువకుల రక్తదానం

వోరుగంటి జన్మదినం సందర్భంగా యువకుల రక్తదానం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వోరుగంటి వెంకట రమణారావు 58 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో 20 యువకులు రక్తదానం చేశారు. అంతకు ముందు ఎడ్లంగిడి రామాలయంలో రమణారావు పేరు మీద పూజలు నిర్వహించి  కేక్ కట్  చేశారు. అనంతరం పట్టణంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో నాచుపల్లి రెడ్డి, చిత్తారి మధుకర్, సింగారావు, సత్యం రావు, బాలాజీ, సత్తయ్య, సాయికుమార్, రాజేశ్వరరావు, అజిత్ రావు, ప్రమోద్ రావు,గణేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.