జగిత్యాలలో గాలి వాన  బీభత్సం

జగిత్యాలలో గాలి వాన  బీభత్సం
  • చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపాడి రెండు కార్లు ధ్వంసం

ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పాత బస్టాండ్ , వివేకానంద స్టేడియం సమీపంలో శనివారం కురిసిన గాలివాన బీభత్సానికి ఓ చెట్టు విరిగిపడిపోగా, చెట్టు విద్యుత్ వైర్ల పై పడి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.ఈ  ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి వచ్చి ఎలాంటి ప్రమాదం జరుగకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివారం ఉదయం కొత్త విద్యుతు స్థంబాలను విద్యుతు అధికారులు పునరుద్ధరించానున్నారు . దీంతో ఆదివారం ఉదయం వరకు  ఆ ప్రాంతమంతా అందాకారంలోనే ఉండనుంది.