క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల 

క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల 
  • జీవితం లో వచ్చే ఆటు పోట్ల ను ఎదుర్కోవడానికి క్రీడలు దోహదం 
  • ప్రభుత్వం నుండి త్వరలో యువత కు  కిట్ ల పంపిణీ 
  • సూర్యాపేట లో మరో క్రికెట్ అకాడమీ, క్రికెట్ గ్రౌండ్ 
  • తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిషోర్ కుమార్ తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • క్రికెట్ ఆడి సందడి చేసిన మంత్రి, ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-బావి భారత క్రికెట్ క్రీడాకారులును తయారు చేయడమే లక్ష్యంగా సూర్యాపేట లో మరో క్రికెట్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణం ,కుడ.కుడ రోడ్ లో  నూతనంగా  ఏర్పాటు చేసిన ఎస్.జి.ఎం   క్రికెట్‌ గ్రాండ్ , అకాడమీని హైదరబాద్ క్రికెట్ అసోసియేన్ కోచ్ గోపాల్, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  క్రీడలు  విద్యార్థుల  శారీరక, మానసిక ఎదుగుదల  కు దోహదం చేస్తాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

జీవితం లో వచ్చే ఆటు పోట్ల ను ఎదుర్కోవడానికి క్రీడలు ఎంతగానో దోహదం  చేస్తాయి అన్నారు.  క్రీడారంగ అభివృద్ధి  లో  భాగంగా యూత్ ను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యం తో త్వరలో నే ప్రభుత్వం నుండి  యువత కు క్రీడా  కిట్ ల పంపిణీ  చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. క్రీడా రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి కి తోడు గా క్రికెట్ పై అభిమానం తో  అకాడమీ ఏర్పాటు చేసి  సూర్యాపేట జిల్లా కేంద్రం లో  క్రికెట్‌ క్రీడారంగ ప్రగతిని కాంక్షించి అకాడమీని ప్రారంభించడం హర్షణీయమన్నారు.

నెట్‌ ప్రాక్టీస్‌తో ప్రారంభించిన అకాడమీ వర్థమాన క్రీడాకారులకు ఎంతో తోడ్పాటును అందించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అకాడమీ సేవలు అందించాలని  పేర్కొన్నారు.బ్యాటింగ్‌లో బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి మంచి ఆటగాళ్లను తయారు చేయాలని కోరారు.

ఈ సందర్బంగా ఎస్. జీ. ఎం అకాడమీ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే కిషోర్ కుమార్ లు క్రికెట్ ఆడి సందడి చేశారు. కార్యక్రమం లో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జుట్టుకొండ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్షులు సవరాల సత్య నారాయణ, బూర బాల సైదులు గౌడ్, మారిపెద్ధిర్ శ్రీనివాస్ గౌడ్, రంగినేని లక్ష్మన్ రావ్, గుండపు నేనీ కిరణ్, ముదిరెడ్డి అనీల్ రెడ్డి, అన్నపూర్ణ నరేందర్, రఫీ, రమా కిరణ్,ఎస్.జీ.ఎం అకాడమీ  యాజమాన్యం మైనం చంద్ర శేఖర్, మేక పోతుల సంతోష్ గౌడ్, గాలి ప్రవీణ్, వెన్న శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి లు పాల్గొన్నారు.