స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు

స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట కేంద్రంలోని జమ్మిగడ్డ వెదిరే రామచంద్రారెడ్డి తోటలో పలువురు గర్భిణినిలకు సామూహిక శ్రీమంతం లయన్స్ ఆఫ్ సూర్యాపేట స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు.ప్రముఖ వ్యాపార వేత్త,జిల్లా బి ఆర్ ఏస్ నాయకులు,లయన్స్ క్లబ్ రిజియన్ చైర్ పర్సన్ గండూరి కృపాకర్,20వ వార్డు కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్ లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బి ఆర్ ఏస్ ప్రభుత్వం లో నిండు గర్భిణుల విషయంలో పౌష్ఠిక ఆహార లోపం ఉండకూదని భావించి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు చేపట్టారన్నారు.

ఇందుకు అంగన్వాడి కేంద్రాల ద్వారా తగిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం గర్భిణిలకు ప్రత్యేక కిట్లు పంపిణీ చేయడం వీటిలో ఉండే పోషకాహారం ద్వారా పుట్టబోయే బిడ్డ పరిపూర్ణ వంతులుగా జన్మిస్తారన్నారని, నెలలు పూర్తి అయ్యే వరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే తల్లి, బిడ్డ క్షేమం గా ఉంటారన్నారు. స్ఫూర్తి క్లబ్ ఆధ్వర్యంలో పసుపు, కుంకుమలతో పాటుగా స్వీట్లు , పండ్లు,గాజులు, చీరలు,పంపిణీ చేసి నిండు ముత్తైదువులు  గర్భిణీలను దీవించారు.ఈ కార్యక్రమం నిర్వహించిన స్ఫూర్తి క్లబ్ సేవ లు, అంగన్వాడీ లను అభినందించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట స్ఫూర్తి అధ్యక్షురాలు బీరవోలు హైమావతి, ట్రెజరర్ విజయలక్ష్మి, చార్టర్ ప్రెసిడెంట్ ఇరిగి కోటేశ్వరి, ఎన్ సి లు రోజా, కేతిరెడ్డి పద్మ, కోనా ఆండాలు, నిర్మల, అంగన్వాడీ టీచర్లు భరణి, పద్మ, అనిల,కలమ్మ తదితరులు పాల్గొన్నారు.