కంప చెట్లలో  కన్నతల్లి పేగు బంధం

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట: ప్రకృతిలో అన్నింటికన్నా మధురమైనది,  గొప్పది కన్నతల్లి ప్రేమ అంటారు. ఈ సృష్టిలో చెడ్డ తండ్రి ఉండొచ్చేమో గాని చెడ్డ తల్లి ఉన్నట్టుగా చరిత్రలో దాఖలాలు లేవు. అలాంటి కన్నతల్లి  కన్న పేగు బంధాన్ని కంపచెట్లలో విసిరేసి కసాయి తల్లులు కూడా ఈ సమాజంలో ఉంటారు అని నిరూపించింది.   సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్. మండలం నెమ్మికల్ గ్రామ ఎస్సీ కాలనీలో చర్చి పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అప్పుడే  తెల తెలవారుతుండగా ఆ వైపుగా వెళ్లిన కొందరికి పసిబిడ్డ ఏడుపు వినిపించింది.  వెంటనే అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగు వారికి నవజాత శిశువు కనిపించడంతో  వెంటనే తీసుకువచ్చి చేయాల్సిన పనులన్నీ చేసి ఆ బిడ్డకు  ఒక్క తల్లి కాదు మేమందరం తల్లులమే అని నిరూపించారు.