ఘనంగా దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలు

ఘనంగా దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి  మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కవి దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి , డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ తో పాటు పలువురు  బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. దాశరథి తెలంగాణ కవిగా, రచయితగా తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడని, నిజాం ప్రభువును ఎదిరిస్తూ అనేక రచనలు రచించారని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఈనాటి ఉద్యమానికి ప్రేరణనందించిన మహానీయుడని కొనియాడారు. దాశరథి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య , నాయకులు గుండగాని రాములు గౌడ్, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని శ్రీనివాస్ గౌడ్, గునిగంటి సంతోష్ గౌడ్, కటకం సూరయ్య, నాగమల్లు, తడకమల్ల రవికుమార్, పరమేష్, గోపగాని వెంకన్న గౌడ్, అఖిల్, నరసింహ, సుధాకర్, వెంకన్న, సాయికిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.