రాజకీయ వారసులోస్తున్నారు ...

రాజకీయ వారసులోస్తున్నారు ...
  • కోరుట్ల నియోజకవర్గంలో నాడు తండ్రులు 
  • నేడు తనయులు రాజకీయ రంగ ప్రవేశం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజక వర్గంలో ఈసారి రాజకీయ వారసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. వారు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతే ఈ సారి యువతరం మధ్య పోటి నెలకొననుంది. వారసత్వంలో ఇదివరకే రంగప్రవేశం చేసిన వారు ఒకరు కాగా ... ఈ సారి బరిలో దిగాలనుకున్తున్నవారు మరికోదంరు . ఇప్పటికే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసేందుకు సిద్దమై వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజలను కలుస్తూ నియోజక వర్గాన్ని చుట్టి వస్తున్నారు. 

స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్ ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ సారి తాను ఎన్నికల బరిలోనుంచి తప్పుకొని తన కొడుకుకు రాజకియా వారసత్వాన్ని అప్పగించాలని అనుకున్నారు. ఇందుకోసం ఆయన ఎప్పటి నుంచో వైద్యుడు అయిన తన కొడుకు కల్వకుట్ల  సంజయ్ కుమార్ ను ప్రజలకు, పార్టీకి పరిచయం చేయలని చూస్తూ వస్తున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంబోత్సవం సందర్బంగా సియం  కేసిఆర్  జగిత్యాలకు రాగ బిఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు అయిన విద్యాసాగర్ రావు పేరుతో ఏర్పాటు చేసిన ప్లెక్షిల కంటే ఆయన కొడుకు డా. సంజయ్ కుమార్  పేరుతో ఏర్పాటు చేసిన ప్లెక్షిలె ఎక్కువగా కనిపించాయి. అప్పుడే అనుకున్నారు జిల్లా ప్రజలు కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు. అనుకున్నదే తడువుగా సియం కేసిఆర్ కు స్వాగతం పలికే సభ్యులలో కల్వకుట్ల సంజయ్ కూడా చేరి కేసిఆర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. దీంతో సంజయ్ రాజకీయ అరంగ్రేటం అయినట్లు ఇటు జిల్లా ప్రజలు, అటు కోరుట్ల నియోజక వర్గ ప్రజలు నిర్ధారించుకున్నారు. అప్పటి నుంచి సంజయ్ కుమార్ నియోజక వర్గంలో విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అలగే సందర్బం వచ్చినపుడల్లా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రాబోయే ఎన్నికల్లో తన కొడుకు బరిలో ఉంటారని, నాలా తన కొడుకు సంజయ్ ను కూడా ఆశిర్వధించాలని కోరుతూ వస్తున్నారు. ఇప్పటికి సంజయ్ పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలతో కలిసి ప్రజల్లోకి తీసుకెల్తున్నారు. సియం రిలీఫ్ చెక్కల పంపిణి మొదలుకొని ప్రస్తుతం రాష్ట పార్టి ఆదేశాల మేరకు రైతు వేదికలలో కాంగ్రెస్ పార్టి వ్యతిరేక తీర్మానాలను తన నాయకత్వంలోనే స్వయంగా నిర్వహిస్తూ రోజు పాల్గొంటూ కార్యక్రమాలు చేపడుతు రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వారసుడిగా సిద్దం అవుతున్నారు.

మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే  సుప్రీం కోర్ట్ న్యాయవాది దివంగత కొమిరెడ్డి రాములు పెద్ద కొడుకు కొమిరెడ్డి కరం చంద్ ను తన రాజకీయ వారసుడిగా కొమిరెడ్డి రాములు ఇదివరేకే ప్రకటించారు. ఈ మధ్యనే మాజీ ఎమ్మెల్యే రాములు మృతి చెందగా కరంచంద్  అప్పటి నుంచి మెట్పల్లి లో నే  ఉంటూ  కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్ గా పని చేస్తూ, ఆందోళన కార్యక్రమాలు చేపడుతు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ రామన్న వారసుడిని రాబోయే ఎన్నికల్లో కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ బిజే పి అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పుడు కోరుట్ల ప్రాంతానికి చెందిన సురబి భూంరావు ఆల్ ఇండియా లేబర్ కాంట్రాక్టు మాజీ చైర్మన్ భూంరావు అప్పటి టిఆర్ఎస్ పార్టి నుంచి బిజెపిలో చేరారు. భూంరావు కేంద్ర ఒప్పంద కార్మికుల సలహామండలి చైర్మన్ గా పనిచేశారు. ఇప్పటికి బిజేపిలోనే కొనసాగుతుంన్నారు. ఆయన కుమారుడు సురబి నవీన్ కుమార్ కార్పోరేట్ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ మధ్యనే  కోరుట్ల నియోజవర్గ బిజేపి టికెట్ ఆసిస్తూ కోరుట్ల లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి  బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుంగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అప్పటి నుండి నియోజక వర్గ స్థాయిలో విస్తృతంగా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల మధ్య ఉంటున్నారు. 

ఉమ్మడి కరీంనగర్ జడ్పీ ఛైర్మెన్ దివంగత కల్వకుంట్ల రాజేశ్వర్ రావు వారసుడిగా ఆయన సోదరుడి కొడుకు కల్వకుంట్ల సుజిత్ రావు  2009లో టిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరి అప్పటి నుంచి పార్టిలో పని చేస్తు వస్తున్నారు ఈ మద్య రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్బంగా పార్టీకి చేయుతనంధించారు. అలగే నియోజక వర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు వారసుడు అయిన జువ్వాడి నర్సింగ రావు ఇదివరకే రాజకీయ రంగప్రవేశం చేశారు.  వైయస్ రాజశేకర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో ఎపిఐఐసి డైరెక్టర్ గా వ్యవహరించారు. రత్నాకర్ రావు వారసుడిగా 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి రాకపోవడంతో  ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చెంది రెండవ స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళి ఓటమి చెందినప్పటికి ప్రజా క్షేత్రంలోనే ఉండి సమస్యలఫై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరోసారి పోటికి సిద్ధం అవుతున్నారు. చూడాలి మరి ఈ వారసులలో ఎవరెవరికి టికెట్లు వస్తాయో ... ఎవరు  వారసత్వాన్ని కొనసాగిస్తారో ... కోరుట్ల నియోజక వర్గ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో .. ఎవరికి పట్టం కడుతారో వచ్చే ఎన్నికల తీర్పు చెబుతుంది.