రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెరికలమంతా ఏకమై ఉద్యమిస్తాం

రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెరికలమంతా ఏకమై ఉద్యమిస్తాం
  • సరైన ప్రాతినిధ్యం కోసం ఆయ పార్టీల్లోని నాయకులు ఒత్తిడి తేవాలి
  • జనాభా దామాషా ప్రకారం పెరికలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి
  •  సూర్యాపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్,  పెరిక సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ
  •  విజయవంతంగా పెరిక కుల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రాజకీయ పార్టీలు పెరిక కులస్తులకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించే వరకు పెరిక కులస్తులమంతా ఐక్యంగా ఉద్యమిస్తామని సూర్యాపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్,  పెరిక సంఘం రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు.

పెరికల ఆత్మగౌరవం - రాజకీయ ప్రాధాన్యత అనే అంశంపై ఆదివారం స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పెరిక కుల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ చరిత్ర కలిగిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరికల ఆత్మగౌరవం రాజకీయ ప్రాధాన్యత కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 200 గ్రామాల్లో 1,50,000 జనాభా మన పెరికలు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా పెరికలకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ఆలోచన చేయడం లేదని అందుకోసం పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జనాభా దామాషా ప్రకారం పెరిక కులస్తులకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని ఆయా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. గతంలో మేము పాలించిన పాలనలో మా నిజాయితీని గుర్తించాలన్నారు. *30 సంవత్సరాల క్రితమే తాను మున్సిపల్ చైర్మన్ గా సూర్యాపేట పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు అనేక పార్టీలో మేమున్నామని మాకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరికల ఆత్మగౌరవ భవనం కోసం రెండు ఎకరాల స్థలాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విన్నవించగా మంజురుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన నిర్వహిస్తుండగా, బిఆర్ఎస్ పార్టీ జిల్లాస్థాయి సమావేశాలకు వెళుతుందని బిసి ఉద్యమాల్లో మన వంతు పాత్ర పోషించాలన్నారు. శాసనసభలో పార్లమెంటులో బీసీలకు సరైన సీట్లు కేటాయించి రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలన్నారు. తమ కులానికి వృత్తి లేదని వ్యవసాయం, విద్య,  రాజకీయమే మా వృత్తులని అన్నారు. ఈ సమావేశానికి కొన్ని నియోజకవర్గాల నుంచి మన నాయకులు వస్తుంటే పోవద్దని హెచ్చరికలు జారీ చేయడం బాధాకరమన్నారు. ఈ బల ప్రయోగం ఎక్కువ రోజులు ఉండదని రాజకీయ పార్టీలు మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించే వరకు ఐక్యంగా ఉద్యమిస్తామన్నారు. *ఈ సమావేశంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా హాజరైన పెరిక ప్రజాప్రతినిధులు,  మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజకీయ ప్రాతినిధ్యం కోసం తమ అమూల్య సలహాలు సూచనలు అందజేశారు.*పిసిసి వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య, పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రదాన కార్యదర్శి సముద్రాల రాంబాబు, పత్తిపాక వేణు ధర్, సుంకరి అజయ్ కుమార్, డాక్టర్ ఎం.ఎస్. శివరామకృష్ణ, డాక్టర్ సుధీర్, పిన్నేని కోటేశ్వర రావు, దొంగరి యుగెందర్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బాల్తు శ్రీనివాస్, కార్యదర్శి బందు శ్రీధర్, వివిధ రాజకీయ పార్టీల పెరిక కుల్ నాయకులు  అంగిరేకుల నాగభూషణం, పాండు, జుకురి రమేష్, కోతి పుల్లయ్య, బోలిషెట్టి వెంకటేశ్వర్లు, బుక్కరాజు కోటేశ్వర్, కోతి మదు, కాంతారావు, యర్రంశెట్టి పిచ్చయ్య, సత్యనారాయణ, శ్రీకర్, సైదులు, కందుల కోటేశ్వర్ రావు, బాదే ధర్మయ్య, బోలిశెట్టి మదు, బత్తుల అశోక్, కందుల చంద్రశేఖర్, తోగరు రమేష్ తదితరులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.