విస్మరణకు గురవుతున్న ముదిరాజులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.

విస్మరణకు గురవుతున్న ముదిరాజులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.
  • ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి ముదిరాజ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ ముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగి ఉన్న ముదిరాజ్ కులం  రాజ్యాధికారంలో  విస్మరణకు గురైతుందని  ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు  ఈదుల యాదగిరి ముదిరాజ్ అన్నారు . సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న ముదిరాజులు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం  ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కి మాత్రమే పరిమితమయ్యారని, కార్పొరేషన్ పదవులలో కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదని  అసంతృప్తి వ్యక్తం చేశారు . రాష్ట్రంలో అత్యధిక జనాభాను కలిగివుండి సుమారుగా  60 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం  చేసే విధంగా వుండి   ఎటువంటి ప్రాధాన్యతనోచుకో  లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు .  రాబోవు  ఎన్నికలలో 10 అసెంబ్లీ సీట్లు మహబూబ్నగర్, మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాలు కేటాయించాలని. అంతేకాకుండా ముదిరాజుల ఆకాంక్షలు వివిధ రాజకీయ పార్టీలకు తెలియజేసే విధంగా త్వర లో ముదిరాజ్ ప్లీనరీ  కూడా ఏర్పాటు చేసి తీర్మానాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బైరబోయిన.శ్రీను కౌన్సిలర్ ఆకుల.లవకుశ రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు ఆకుల.రాజేష్ జిల్లా యువత అధ్యక్షుడు ఇండ్ల. సురేష్ మహిళా అధ్యక్షురాలు.దండు.రేణుక జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘమ్ డైరెక్టర్ సారగండ్ల.కోటయ్య. నల్లమేకల.వెంకన్న గుంటి.సైదులు కొల.నాగరాజు జిల్లా జనరల్ సెక్రటరీ. ఢిల్లీ.పావని సూర్యాపేట అధ్యక్షురాలు.సారగండ్ల.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.