గ్రామస్థాయిలో ప్రత్యేక  పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి

గ్రామస్థాయిలో ప్రత్యేక  పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

ఈనెల 23 వరకు వారం రోజులపాటు గ్రామస్థాయిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని పాన్పహడ్ మండలంలో గల సింగారెడ్డి పాలెం లో గ్రామపంచాయతీ భవనాన్ని, వైకుంఠధామం వరకు వేస్తున్న రోడ్డు పనులను కలెక్టర్ సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పై కలెక్టర్ సిబ్బందిని మందలించారు. రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని  కలెక్టర్ తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ప్రత్యేక అధికారులందరూ ఈరోజు గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఉదయం ఏడు గంటలకే గ్రామాలలో ఉండి జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని అన్ని రహదారులను శుభ్రం చేయాలని, గుంతలను పూడ్చాలని ,పిచ్చి మొక్కలను తొలగించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, నిరు నిలువ ఉండే లోతట్టు ప్రదేశాలను గుర్తించి నీరు నిలువ లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఫాగింగ్ చేయాలని నీటి గుంటలలో ఆయిల్ బాల్స్, గంబుషియా చేపలు వదలాలని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలు ఏపీఎంలు సిబ్బంది పాల్గొన్నారు.