సబ్బండ వర్ణాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం

సబ్బండ వర్ణాల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం
  • లక్ష సాయం చారిత్రాత్మక నిర్ణయం
  • ఇటువంటి పథకం దేశంలో ఎక్కడాలేదు 
  • కులవృత్తుల సంక్షేమానికి లక్షరూపాయలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ దే 
  • బీఆర్ఎస్ హాయం లోనే కుల వృత్తులకు  అండ - చేతి వృత్తులకు చేయుత 
  • కాంగ్రెస్ పాలన లో ఉమ్మడి నల్లగొండ ఆగం
  • ఆ నాయకులకు ఆకారాలే కాధు - అహంకారమూ ఎక్కువే
  • కాంగ్రెస్ హయాంలో సాగర్
    ఆయకట్టులో వరుసగా మూడు పంటలకు నీరు ఇచ్చింది ఏనాడు లేదు
  • సాగర్ ఆయకట్టులో వరుసగా 17 పంటలకు సాగు నీరు ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీధి 
  • పదవుల కోసం ప్రజలను తాకట్టు పెట్టిన చరిత్ర వారిది 
  • నల్గొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చే సాకారం కేసీఆర్ తోనే సాధ్యం
  • కోదాడలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం
  • ఉమ్మడి నల్లగొండ జిల్లా లో లక్ష సాయం షురూ 
  • సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం లో  వెనుకబడిన కులాలు/కుల వృత్తుల వారికి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరై 294మంది లబ్ధిదారులకు  రూ 2.940కోట్ల చెక్ లను పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, 
  • కోదాడ శాసన సభ్యులు భొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యం లో జరిగిన పంపిణీ కార్యక్రమం

ముద్ర కోదాడ: ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి రూ.లక్ష  ఆర్థికసాయం అందించాలని  ముఖ్యమంత్రి  తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నమని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ లోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో  వెనుకబడిన  కులాలు,కులవృత్తులకు రూ.లక్ష పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 294 మంది లబ్ధిదారులకు లక్ష  చొప్పున రూ 2.94 కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా బీసీల కోసం ఇలాంటి పథకం లేదన్నారు. 

సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి  కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి  కేసీఆర్ చేయూతనంది స్తున్నారని తెలిపారు.ఉమ్మడి  నల్లగొండ  జిల్లా వ్యాప్తంగా ప్రతీ  నియోజకవర్గంలో 300 మందికి  లక్ష  రూపాయాల చొప్పున సహాయం అందజేస్తామని అన్నారు.

ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  బీసీ కులాలు, చేతివృత్తుల వారి అభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, అవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ కులాలకు చెందినవారికి సర్కారు సాయమందించనున్నట్లు పేర్కొన్నారు.

గత పాలకుల హయాంలో వెనుకబాటు తనానికి గురైన కులవృత్తులకు ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవం పోస్తున్నారని కొనియాడారు. 9 మంది అక్కాచెల్లెళ్ల తోబుట్టువు గా ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు. అందుకే  దేశంలో ఎక్కడాలేని విధంగా కులవృత్తుల సంక్షేమానికి లక్షరూపాయలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేఆన్నారు . సమాజం చివరి అంచులో ఉన్న వారికి ప్రభుత్వ లక్ష్యాలను చేరాలని ఉద్దేశంతోనే లక్ష సహాయానికి శ్రీకారం చుట్టారన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో అనేక వృత్తుల్లో కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశించగా, తెలంగాణలో కులవృత్తులు అంతరించిపోయే దుస్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా ఆదుకోకపోవడంతో వృత్తి పనులు నడువక, ఆదాయం రాక అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గం లొ ఇద్దరికో ముగ్గురి కొ లోన్  లు ఇస్తే,50 వేల లోన్  కు ఆరు నెలలు తిరిగితే చివరకు 25వేలు వచ్చేవన్నారు. ఒకసారి లబ్ది పొందిన వ్యక్తులకు మరోసారి అవకాశం రాకపోగా తీసుకున్న కొద్ది పాటి డబ్బుకు లక్ష రూపాయలు చెల్లించాల్సి  వచ్చేది అన్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై అనేక మంది వృత్తులను వదులుకొని వలస వెళ్లారని గుర్తు చేశారు.

ఈ పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్‌ స్వరాష్ట్రంలో కులవృత్తులకు పునర్జీవం పోసేందుకు నడుంబిగించారన్నారు. కూలీలుగా జీవనం సాగిస్తున్న అనేక మంది వృత్తిదారులను ఓనర్లుగా మార్చేందుకే రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. తెలంగాణ సాకారమైన తర్వాత రజక, నాయీబ్రాహ్మణ  కులవృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఉచిత విద్యుత్‌ పథకం ప్రారంభించి, నెలకు 250 యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం స్ఫూర్తితోనే బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుంటున్న వారందరికీ సాయమందించాలనే ఆలోచనతో బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్‌ నాంది పలికారన్నారు. మానవ మనుగడ ఉన్నన్ని రోజులు అన్ని వృత్తులు కూడా అవసరమేనని, అందుకే కల్యాణలక్ష్మి, రైతుబంధు రైతు బీమా, 24 గంటల కరెంటు,

ఆసరా పెన్షన్లు  తరహాలో ఈ పథకం కూడా నిరంతరాయంగా అమలవుతుందని పేర్కొన్నారు. తెలిసో తెలియకో 2014లో కాంగ్రెస్ ను గెలిపించిన కోదాడ ప్రజలు 2018 తర్వాతే అభివృద్ధి అంటే ఏమిటో చూశారని అన్నారు. పదవుల కోసం తమను ఓటు వేసి గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టిన చరిత్ర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులదని ఎద్దేవా చేశారు. వారి పాలనలో సాగరాయకట్టులో ఏనాడు కూడా వరసగా మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన సందర్భం లేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే చివరి భూములు అని చెప్పి తప్పించుకున్నారు తప్పా ఈనాడు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఆ నాయకులకు ఆకారాలతో పాటు అహంకారము ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కోదాడ లో జరుగుతున్న అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలంటే  ఇక్కడి ప్రజలు గులాబీ జెండాకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు  అండగా ఉండాలని కోరారు. కరువు వచ్చినప్పుడు ప్రశ్నార్థకమవుతున్న కృష్ణ ఆ యకట్టు పరివాహక ప్రాంతానికి కాలేశ్వరం జలాలు తెచ్చే సాకారం  రాబోయే కాలం లో కెసిఆర్ తోనే సాధ్యపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.