సెల్ ఫోన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

సెల్ ఫోన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఎస్ ఐ హరికృష్ణ

హుజూర్ నగర్  టౌన్ ముద్ర:సెల్ ఫోన్లు వాడటం వలన విద్యార్థులు చెడు వ్యసనాలు అలవాటు చేసుకోకుండ జాగ్రత్త పడాలని హుజూర్ నగర్  ఎస్ఐ హరికృష్ణ అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ పోలీసు కళాబృందం చేత కళాశాలలో షీ టీమ్స్ ,సైబర్ నేరాలపై  అవగాహన కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు , సూర్యాపేట జిల్లా షీ టీమ్స్ ఇంచార్జ్ నాగభూషణం ఆదేశాలతో  ఎస్.ఐ.హరికృష్ణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షీ టీమ్స్ మహిళల భద్రత కోసం పనిచేస్తాయని, ఆపద సమయంలో డయల్ 100 కి ఫోన్ చేసిన వెంటనే  షీ టీం బృందం మీ దగ్గరకు వస్తారని తెలిపారు.

విద్యార్థులు సెల్ ఫోన్ వాడటం వల్ల చెడు వ్యసనాలను అలవాటు చేసుకోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. టోల్ ఫ్రీ  1930  గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సూర్యపేట షీ టీం ఎస్సై పాండు నాయక్ షీ టీం హెడ్ కానిస్టేబుల్ జాఫర్ ,ఎస్ఐ లింగారెడ్డి, ఏఎస్ఐ రమేష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ ఎల్లయ్య ,గోపయ్య, కృష్ణ, గురులింగం, విద్యార్థులు పాల్గొన్నారు.