పోలీసు  గ్రీవెన్స్ డే కార్యక్రమానికి 12 ఫిర్యాదులు

పోలీసు  గ్రీవెన్స్ డే కార్యక్రమానికి 12 ఫిర్యాదులు
  • పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకండి.
  • ఆన్లైన్ ద్వారా పేయింగ్ గేమ్స్ ఆడేటప్పుడు బ్యాంక్ యూపీఐ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టాన్ని కలగజేసే అవకాశం ఉన్నది
  • ఫిర్యాదుదారులతో మాట్లాడిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ 

 ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 12 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్  తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు ఎస్పీ  ఆదేశాలు జారీ చేసినారు. బాధితులకు సత్వర భరోసా కల్పించాలని పిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు సిబ్బందిని ఆదేశించారు.

పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వకండి.

ఆన్లైన్ ద్వారా పేయింగ్ గేమ్స్ ఆడేటప్పుడు బ్యాంక్ యూపీఐ ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్థిక నష్టాన్ని కలగజేసే అవకాశం ఉన్నది కావున తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వవద్దని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్  తెలిపినారు. పిల్లలు మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడేటప్పుడు ప్లేయింగ్ గేమ్ ఆప్షన్ ద్వారా మీ మొబైల్ లో ఉన్న బ్యాంక్ యు.పి.ఐ ఐడి హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ  తెలిపినారు. సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి పిర్యాదు చేయాలని అన్నారు. మీ మొబైల్ ఫోన్ పోయిన, దొంగతనానికి గురైనా CEIR అంతర్జాలం నందు పిర్యాదు చేయాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండాలి అన్నారు. అపరిచితులు మీ వ్యక్తిగత వివరాలు తెలిపి మోసపోవద్దు అని కోరినారు.