ఘనంగా  ఎమ్మెల్యే శానంపూడి జన్మదిన వేడుకలు

ఘనంగా  ఎమ్మెల్యే శానంపూడి జన్మదిన వేడుకలు

ముద్ర నేరేడుచర్ల:-హుజూర్నగర్  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేరేడుచర్లలో బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ  నాయకులు సంయుక్తంగా  పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. అభిమానులు నాయకులు కార్యకర్తలు  గజమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం నిర్వాహకులు  అన్నదానం చేశారు. పలువురు అధికారులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయబాబు, ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ నర్సయ్య, నేరేడుచర్ల, పాలకవీడు బీఆర్ఎస్ మండలాధ్యక్షులు సురేశ్, అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదర్, డీసీసీబీ డైరెక్టర్ అప్పిరెడ్డి, రైతుసమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీనారాయణ, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ్య, మత్స్యకార సంఘం చైర్మన్ వీరయ్య, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీను, శ్రీకాంత్, పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు సైదులు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.