హరిత హారంలో బాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు 

హరిత హారంలో బాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు 
  • కల్లూరు సర్పంచ్ పల్లెపంగు నాగరాజు

నేరేడుచర్ల రూరల్ ముద్ర:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి  హరితహారం కార్యక్రమంలో  భాగంగా బుధవారం మండల పరిధిలోని కల్లూరు గ్రామపంచాయతీ  ప్రతి ఇంటికి 6 మొక్కలను స్థానిక సర్పంచ్  పల్లెపంగు నాగరాజు చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశానుసారం స్వయంగా గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసుకొని,మొక్కలను పెంచుకోవడం జరిగిందనీ ,ఇవి చాలా నాణ్యమైన మొక్కలు కావున ప్రతి ఒక్కరు ఈ మొక్కలను తీసుకొని పెంచి పెద్ద చేసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రహదారి వెంట సుమారు 15 వేల మొక్కలను నాటడం జరుగుతుందనీ, కావున ప్రజలందరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకొని, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే విధంగా  తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె పద్మ,ఫీల్డ్ అసిస్టెంట్ బుడిగె శోభన్‌బాబు,వార్డు నెంబర్ బుడిగె రేణుక శేఖర్,గ్రామ పెద్దలు మేకపోతుల పిచ్చయ్య గౌడ్ ,బుడిగే వెంకటేశ్వర్లు,గొడ్డేటి పుష్ప నాగేశ్వరరావు,పగిడిపల్లి సుజాత గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.