వెలుగుల భవనానికి  వైభవంగా శంకుస్థాపన మహోత్సవం 

వెలుగుల భవనానికి  వైభవంగా శంకుస్థాపన మహోత్సవం 

 సూర్యాపేట లోని జమ్మి గడ్డ లో   జిల్లా విద్యుత్  సమీకృత భవనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

7కోట్ల 15లక్షల వ్యయం తో  నిర్మించనున్న విద్యుత్ కార్యాలయ భవనం

ఇక సర్కిల్‌, డివిజన్‌, సబ్‌ డివిజన్‌, ఈఆర్‌ఓ కార్యాలయాలన్నీ ఒకేచోట

పండుగ వాతావరణం లో శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం 

 ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ  మంత్రి గా ఉన్నగుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాకు మరింత ప్రాధాన్యం దక్కుతున్నది.. ప్రస్తుతం సూర్యాపేట లో  ఐకాన్ గా  ఉన్న  ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం,మెడికల్ కాలేజ్, సమీకృత కూరగాయల మార్కెట్, సద్దుల చెరువు టాంక్ బండ్ ల సరసన నిలిచేలా సమీకృత విద్యుత్‌ సర్కిల్‌ కార్యాయం నిర్మాణం కానుంది.. ఈ మేరకు  ఆదివారం సూర్యాపేట లోని జమ్మిగడ్డ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఆవరణలో 7 కోట్లా 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన భవనానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. .

ఆగస్టు  15 నాటికి పూర్తి చేయాలని  సంబధిత గుత్తేదారులను మంత్రి ఆదేశించారు.ఈ భవన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సర్కిల్‌ ఇంజినీర్‌ కార్యాలయం, డివిజనల్‌ ఇంజనీర్‌ కార్యాలయంతో పాటు సబ్‌ డివిజనల్‌ ఇంజినీర్‌, ఈఆర్‌ఓ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమం లో ఎస్. ఈ పాల్, మున్సిపల్ చైర్మన్ పేరుమాల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, గండూరి ప్రకాష్ ,  వై.వీ,పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, జడ్పీటిసి జీడి బిక్షం, పట్టణ బీఆర్ ఎస్ అధ్యక్ష , కార్యదర్శులు సవరాల సత్యనారయణ, బూర బాల సైదులు గౌడ్, రాపర్తి శ్రీనివాస్, గురూజీ, విద్యుత్ శాఖఅధికారులు,తదితరులు పాల్గొన్నారు .