ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆర్టిసి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాయని సూర్యాపేట డిపో మేనేజర్ సురేందర్,తెలంగాణ మజ్దూర్ యూనియన్ హైదరాబాద్ జోనల్ జాయింట్ సెక్రటరీ సుంకర శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి స్వాగతిస్తూ సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ జగదీశ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు . ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత పెరిగిందని అదేవిధంగా పెండింగ్ బకాయిలు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని తెలిపారు. 40 వేలకు పైగా ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ భాగస్వాములు అవుతున్నామని తెలిపారు కార్యక్రమంలో టీఎంయూ సీనియర్ నాయకులు బెల్లీ నరసయ్య, డివిజన్ చైర్మన్ బొజ్జ సైదులు, డివిజన్ సెక్రెటరీ చెరుకు వెంకటయ్య, డిపో ప్రెసిడెంట్ ఎండి గాని, డిపో కార్యదర్శి ఎం లచ్చయ్య, సహాయ కార్యదర్శి మాచర్ల భాస్కర్,డి భాను, మహమ్మద్ జానీ పాషా, మహిళా కార్యదర్శి ఎన్ సావిత్రి ,సహాయ కార్యదర్శులు డి ఎల్లమ్మ , మాధవి, రేణుక, మేరీ కోన నాగరాజు,రేకల ప్రకాష్, కొల్లు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.