మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు

మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన బిజెపి కార్యకర్తలు
  • అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ బిజెపి నాయకుల నినాదాలు
  • బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ  బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు నేతృత్వంలో బిజెపి నాయకులు  అర్హులైన లబ్ధిదారులతో కలిసి మంత్రి జగదీశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించడం జరిగింది. క్యాంప్ ఆఫీస్ కు భారీగా బిజెపి కార్యకర్తలు చేరుకొని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నినాదాలు చేస్తుండడంతో పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త  వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా క్యాంప్ ఆఫీస్ కు చేరుకొని బిజెపి నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య సీనియర్ నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి కాపా రవి సంకినేని వరుణ్ రావు లు  మాట్లాడుతూ 9 సంవత్సరాల  కాలంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాలనలో 900 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా కట్టించలేకపోయాడని ఆరోపించారు.

మంత్రి జగదీశ్వర్ రెడ్డి దత్తత గ్రామం ఏపూర్ లో  చీదెళ్ళ గ్రామంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం  లేదు అని ప్రశ్నించారు.కేసారం గ్రామంలో ఏడు సంవత్సరాల నుండి కడుతున్న డబుల్ బెడ్ రూమ్ లు నాసిరకంగా నాణ్యత లేకుండా చేస్తూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.ఇందిరమ్మ ఫేస్ త్రీ కాలనీలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు పంచడం లేదన్నారు.
కట్టిన ప్రతి ఇంటిని ఎన్నికల్లో పార్టీ మారిన వారికి మాత్రమే ఇచ్చేలా రాజకీయ లబ్ధి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు.సూర్యాపేట నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు వచ్చేంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు ఈ ముట్టడి కార్యక్రమంలో  నాయకులు  జిల్లా  ప్రధాన కార్యదర్శి మల్లిపాక సాయిబాబా,  యాదగిరి,వెంకట్ రెడ్డి,కొండ సోమయ్య వివిధ మండలాల అధ్యక్షులు  బంగార్రాజు,హనుమంతు యాదవ్, సాగర్, చిరంజీవి,శంకర్, మహేందర్,  మల్లయ్య , సుభాష్ రెడ్డి, శంకర్, సత్తయ్య, అశ్విన్, సోమయ్య, సోమేశు, నాగిరెడ్డి, సోమిరెడ్డి, సత్తయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.