పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి కు తగదు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి కు తగదు.
  • సమాజ రక్షణలో పోలీస్ సిబ్బంది నిర్విరామంగా పని చేస్తున్నారు.
  • సూర్యాపేట పట్టణ PS నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు మాట్లాడిన పోలీసు సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఆదివారం తెలంగాణ రాష్ట్ర TPCC ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పోలీసులను కించపరుస్తూ అగౌరవపరుస్తూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం హేయ మైన చర్య, దీనిని పోలీసు అధికారుల సంఘం తరపున ఖండిస్తున్నాము అని సూర్యాపేట జిల్లా పోలీసు సంఘం అధ్యక్షులు బెల్లంకొండ రామచందర్ అన్నారు. 24 గంటలు ప్రజల రక్షణ శాంతిభద్రతల పరిరక్షణలో కృషి చేస్తూ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులు విధులు నిర్వహిస్తున్నాo అని తెలిపినారు. ఈ క్రమంలో పోలీసులను కించపరిచేలా పోలీసుల బట్టలు ఊడదీసి కొడతాం అని మాట్లాడడం తగదు అని అధ్యక్షులు ఖండించారు.

ఈ సమావేశం సందు సంఘం సభ్యులు asi కే అంజన్ రెడ్డి, g వెంకన్న, సిబ్బంది ఉన్నారు.