అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలి.

అర్హులంతా ఓటర్లుగా నమోదు కావాలి.
  • బి.యల్.ఓ లకు కిట్ల పంపిణీ.
  • పోలింగ్ కేంద్రం పరిశీలన.
  • జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ యస్. వెంకట్రావు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-జిల్లాలో ఓటర్ నమోదు ప్రక్రియ  ఎక్కువ శాతం జరగాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ యస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా సూర్యాపేట ZPHS లో గల 65 పోలింగ్ కేంద్రం  అలాగే నాగారం మండలం ఫణిగిరి  ZPHS లోని 279, 280, 281 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇ. సి. ఐ నిబంధనలకు లోబడి జిల్లాలో    శనివారం , ఆదివారం 2,3 తేదీలలో  ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమము  నిర్వహించామని  అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటరుగా  నమోదు కావాలని సూచించారు.   బి.యల్.ఓ లు   పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటరు నమోదు కోసం మార్పులు , చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. బిఎల్ఓ లపై పర్యవేక్షణ కొరకు సూపర్వైజర్లను నియమించడం జరిగిందని తెలిపారు. పి.యస్.  నెంబర్ 65 లో  ఫామ్ 6 ద్వారా 16 దరఖాస్తులు , 7 ద్వారా 3, అలాగే 8 ద్వారా 12 దరఖాస్తులు అందాయని అలాగే పణిగిరిలోని 279, 280,  281  పోలింగ్ కేంద్రాలలో ఫామ్ 6 ద్వారా 7  దరఖాస్తులు వచ్చాయని  బి.యల్.ఓ లు  వివరించారు అనంతరం కలెక్టర్ రికార్డులను పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులను వెంటనే విచారణ చేపట్టి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  బి.యల్.ఓ యాప్ లపై సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని తెలుపుతూ బి.యల్.ఓ లకు 12 వస్తువులతో ఉన్న బి.యల్.ఓ  కిట్లను అందచేశారు. రెండు రోజులప్రత్యేక ప్రచార కార్యక్రమం లో భాగంగా  అదనపు కలెక్టర్లు , ఆర్డీవోలు, తాసిల్దార్లు బూత్ స్థాయిలో పర్యటించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో కొత్తగా 18, 19 ఏళ్ళు నిండిన యువత ఓటు నమోదు చేయడంలో . బీఎల్వోలు  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో ఫామ్ 6 ద్వారా 1712, ఫామ్ 7 ద్వారా 115, అలాగే ఫామ్ 8 ద్వారా 634 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు సూర్యాపేట శ్యామ్ సుందర్ రెడ్డి, నాగారం తహసీల్దార్ బ్రహ్మయ్య, బి.యల్.ఓ లు   వసంత, నాగలక్ష్మి, సంధ్య, బి.యల్.ఓ  సూపర్ వైజర్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.