సూర్యాపేట జిల్లా పదవ తరగతి ఫలితాలు

సూర్యాపేట జిల్లా పదవ తరగతి ఫలితాలు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: బుధవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో సూర్యాపేట జిల్లా 89.93% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 15వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 12,190 మంది విద్యార్థులు హాజరు కాగా 10963 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో బాలురు 88.8% ,బాలికలు 91.14% ఉత్తీర్ణత సాధించారు.