గాదరి కిషోర్ కుమార్ కు మూడోసారి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్

గాదరి కిషోర్ కుమార్ కు మూడోసారి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్
  • మూడోసారి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ తమపై నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
  • తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంగతుర్తి నియోజకవర్గం అభ్యర్థిగా తమకు అండగా నిలవాలి
  • నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమారును గజమాలతో సన్మానించిన నియోజకవర్గ బి.ఆర్.ఎస్ కార్యకర్తలు నాయకులు
  • తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిని మరింత ముందుకు తీసుకు వెళ్తా ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం నుండి మూడోసారి బిఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న డాక్టర్ గారి కిషోర్ కుమార్ ను తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ శ్రేణులు హైదరాబాదులోని ఆయన నివాసంలో గజమాలతో ఘనంగా సన్మానించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మూడోసారి తనకు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చిన రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తమపై నమ్మకంతో మెజార్టీ ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించారని తాను ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అమలయేలా చూసానని అన్నారు .మూడోసారి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ప్రజలు మరోమారు అండగా నిలవాలని అలాగే అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రజలు అండగా నిలిచి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేలా ప్రజల సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేశామని ప్రజలు మూడోసారి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తామని అన్నారు .అనునిత్యం తాము ప్రజల మధ్యలోనే ఉంటామని ఇప్పటివరకు ఆ దిశగానే పయనిస్తున్నామని మున్ముందు మరింత ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యలను నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.