ఆర్.కృష్ణయ్య ను కలిసిన వట్టే జానయ్య భాదితులు

  • బి.సి గా ఉండి తోటి బి.సి ల కు చేసిన అన్యాయాలపై కృష్ణయ్య తో గోడు వెళ్లబోసుకున్న బాధితులు
  • బిసి బిడ్డలమైన మాకు న్యాయం చేయాలంటూ వేడుకోలు
  • సానుకూలంగా స్పందించిన క్రిష్ణయ్య
  • అధికారులను అడిగి నిజా నిజాలను తెలుసుకున్న క్రిష్ణయ్య
  • న్యాయం జరిగేలా బాధితులకు అండగా ఉంటానని హామీ

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: న్యాయం కోసం డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య బాధితులు హైదరాబాద్ బాట పట్టారు. ఉదయం మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించి వట్టే జానయ్య దుర్మార్గాలపై పిర్యాదు చేసిన బాధితులు సాయంత్రం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య ను రాంనగర్ లోని ఆయన నివాసం లో కలిసి తమ గోడు ను వెళ్లబోసుకున్నారు. ఈ విషయాన్ని వారు గురువారం సూర్యాపేట విలేకరులకు తెలిపారు. జానయ్యా తమ పై చేసిన దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు చేసి భూములను కబ్జా చేసిన తీరును వివరించారు. తోటి బి.సి అయి ఉండి బి.సి ల మైన మాపై అరాచకాలు చేయడం ఎంత వరకు సమంజసం అని వాపోయారు. మీరే మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు.. బాధితుల నుండి అసలు విషయాలు తెలుసుకున్న కృష్ణయ్య తనకు పూర్తి వాస్తవాలు తెలువదు అని సూర్యాపేట ఆర్డీవో తో మాట్లాడి బాధితులు చెబుతున్న విషయాలను నిజమే అని నిర్ధారించుకున్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని వారి కి న్యాయం జరిగేలా వారి పక్షాన నిలబడి పోరాడుతానని ఆర్. క్రిష్ణయ్య బాధితులకు దైర్యం చెప్పారు. ఆర్ కృష్ణయ్య ను కలిసిన వారిలో బాధితులు వల్ల శేఖర్ సైదులు శ్రీనివాస్ రాంప్రసాద్ సునీత మమత ఉప్పలయ్య చారి తదితరులు ఉన్నారు