11వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు

11వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ఇన్చార్జి  తూరు గంటి అంజన్న సూచన మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ , ఎం ఎస్ పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు  మంగళవారం 11వ  రోజుకు చేరుకున్నాయి సూర్యాపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి  మాజీ ఐఎంఏ అధ్యక్షుడు ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి యాదవ్ మంగళవారం సంఘీభావం తెలిపారు అనంతరం ఈ దీక్షలను ఉద్దేశించి ఆయన  మాట్లాడుతూ  సామాజిక ఉద్యమాల నాయకుడు మందకృష్ణ మాదిగ  గత మూడు దశాబ్దాల నుండి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారనీ సమాజంలో ఉండబడినటువంటి దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆత్మగౌరవం కోసం అస్తిత్వం కోసం  అహర్నిశలు ఉద్యమిస్తున్నారన్నరు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రచించినరాజ్యాంగ  ఫలాలు సమాజంలో ఉన్నబడేటువంటి బడుగు బలహీన వర్గాలందరికి రాజ్యాంగ పలాలు అందాలని సామాజిక ఉద్యమాలు చేస్తున్నారనీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరూ రాజ్యాధికారం వైపు ప్రయాణించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నాయకత్వంలో ప్రస్తుత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అన్నారు. మాదిగ ,మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఈడబ్ల్యూఎస్ ఐదు శాతం నుండి పది శాతానికి పెంచారనీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారనీ అదేవిధంగా తక్షణమే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.దీక్షలో కూర్చున్న వారు సూర్యాపేట పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొజ్జ వెంకన్న ఎం ఆర్ పి ఎస్ & ఎం ఎస్ పి జాతీయ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు సూర్యాపేట పట్టణ ఎమ్మెస్పీ పార్టీ ఇన్ చార్జి దైద వెంకన్న సూర్యపేట ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శిదాసరి వెంకన్న  చెరుకుపల్లి అర్జున్   మిద్దె శ్రవణ్ కుమార్ బైండ్ల సంఘం యూత్ నాయకులు చిలక మహేష్ గ్యార కనకయ్య మిద్దె నాగయ్య , చింత వినయ్ బాబు కొండేటి గోపి గోల్కొండ లింగన్న మచ్చ శ్రీను, మారపల్లి సావిత్ర పంతంనరసయ్య, ప్రమోద్ గద్దల నవీన్ కొరిపెల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.