అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

అంగన్వాడి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
  • డీసీసీ అధ్యక్షుడు శ్రీ హరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరి కాదని డీసీసీ అధ్యక్షుడు కె శ్రీహరి రావు అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఐదేళ్ల లోపు పిల్లలకు పోషకాహారం అందించటం మొదలు పలు కార్యక్రమాల్లో పాలు పంచు కుంటున్నారన్నారు. వారి సేవలను గుర్తించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అంగన్ వాడి ఉద్యోగుల సర్వీసులను  పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.