ఆకర్షణగా నిలిచిన తడగొండ గణేష్ యూత్ మట్టి విఘ్నేశ్వరుడు

ఆకర్షణగా నిలిచిన తడగొండ గణేష్ యూత్ మట్టి విఘ్నేశ్వరుడు
  • మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదర్శయూత్,హనుమాన్ యూత్,శ్రీ సర్వేజన గణేష్ మిత్రమండలి,మహాలక్ష్మీ యూత్,రెడ్డి యూత్ తదితర యువజన సంఘాలు ఏర్పాటు చేసిన పలు మండపాల్లో గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు గణనాతునికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు.తడగొండలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్నేశ్వర ప్రత్యేకంగా నిలిచారు.స్వామికి పూజలు చేసారు. పలువురు గణేష్ యూత్ వారిని అభినందించారు.
యువకులు మాట్లాడుతూ:వినాయక చవితి పండుగ పురష్కరించుకొని నవరాత్సోవాలు ఆడంబంరంగా జరుపుకుంటున్నమన్నారు. పాడిపంటలు సంవృద్దిగా పండి,ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని గణనాథున్ని వేడుకున్నమన్నారు. వినాయక నిమజ్జనం రోజు ఎలాంటి అల్లర్లు పెట్టుకోకుండా శాంతియూతంగా వినాయక నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని యువజన  పక్షాన కోరుతున్నమన్నారు.