రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య శాఖ అడ్ హాక్ కమిటీ ఎన్నికలు 

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య శాఖ అడ్ హాక్ కమిటీ ఎన్నికలు 
  • ముదిరాజ్ సంఘం నేతల మధ్య విదాదం
  • రెండుగా చీలీన బీఆర్ఎస్ నేతలు.. సోంత పార్టీ నేతలనే పోలీసులచే బెదిరింపులు
  • కిడ్నప్ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నాలు..
  • తెరవెనక చక్రం తిప్పుతున్న బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత
  • ముదురుతున్న బీఆర్ఎస్ నేతల వర్గవిబేధాలు
  • మంత్రి కేటీఆర్ ఇలాకాలో.. జిల్లా మత్స్య శాఖ అడ్ హాక్ కమిటీ ఎన్నికల వివాదం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా  మత్స్య శాఖ అడ్ హాక్ కమిటీ ఎన్నికలు వివాదస్పదమవుతున్నాయి. బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా నేతల తీరుతో ముదిరాజ్ సంఘం నేతల మధ్య విబేధాలు చోటు చేసుకోని.. రెండు వర్గాలుగా విడిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే పరిస్థితికి పోయింది. రాజన్నసిరిసిల్ల జిల్లా లో బీఆర్ఎస్ నేతల అధిపత్య పోరుకు ముదిరాజ్ సంఘం రెండుగా చీలీపోయింది. మంత్రి కేటీఆర్ ఇలాకాలో మత్స్యశాఖ అడ్ హాక్ కమిటి ఎన్నికల వివాదం జటిలం కానుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన రామచంద్రంకు ముదిరాజ్ సంఘం నేత బీసీ స్టడి సర్కిల్ డైరక్టర్ జెల్ల వెంకటస్వామీ టీం సపోర్ట్ చేస్తుంది. వేములవాడ నియోజకవర్గం వట్టెంలకు చెందిన తిరుపతికి బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత ఆధ్వర్యంలో బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శహన్మండ్లు, సిరిసిల్ల మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోడి అంతయ్యలు సపోర్ట్ చేస్తున్నారు.

రామచంద్రంకు సంబంధించిన నేతలు సభ్యులను క్యాంపు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో  ఓ సభ్యున్ని బలవంతంగా జెల్ల వెంకటస్వామి, దేవయ్య అనే వ్యక్తులు కిడ్నాప్ చేశారని బీఆర్ఎస్ నేత ఆధేశాలతో ముస్తాబాద్పోలీస్ స్టేషన్లో సోసైటి చైర్మన్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు జెల్ల వెంకటస్వామికి ఫోన్ చేసి కేసు నమోదు చేస్తాం.. అంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల రాజకీయ అధిపత్య పోరుకు పార్టీలో చీలీకలు వస్తున్నయని సమాచారం. జెల్ల వెంకటస్వామితో పాటు దేవయ్యపై పోలీసులు కిడ్నప్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. ఈ విషయమై సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ను ముద్ర వివరణ కోరగా ఫిర్యాదు మేరకు కిడ్నప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తామని పేర్కొన్నారు. 

కుల సంఘాల్లో బీఆర్ఎస్ నేతల రాజకీయాలు..

రాజన్నసిరిసిల్ల జిల్లా లో సోంత పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేయించడానికి ప్రత్నించడమే కాకుండా.. కల సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేతల తీరు వివాదస్పదమవుతుంది. మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మైనార్టీ సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్య నేత తలదూర్చి .. చేతులు కాల్చుకోని క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. సిరిసిల్ల మైనార్టీ కమ్యూనిటిలో నెలకొన్ని సమస్యలు పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేత చీటీ నర్సింగరావుతో పాటు మరికొంత మంది కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లి ఇప్పుడు ముదిరాజ్ సంఘం కు సంబంధించిన మశ్చ్య అడ్ హాక్ కమిటిలో బీఆర్ఎస్ నేతలు తలదూర్చి.. అధిపత్య పోరుకు పోయి.. ముదిరాజ్ల ను రెంగు వర్గాలుగా చీల్చిరన్న అపవాదు వస్తుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి బీఆర్ఎస్ లో ఒక వర్గం ఈసుకెళ్తింది. రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నేత పార్టీ లో ఒక వర్గాన్ని పెంచిపోశిస్తు.. పార్టీకి నష్టం కలిగే పరిస్తితి తెస్తున్నడంటూ.. మంత్రి కేటీఆర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.