సిరిసిల్లలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత యోగ శిక్షణ - యోగా శిక్షకులు, ఏలిగెటి కృష్ణ

సిరిసిల్లలో విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత యోగ శిక్షణ - యోగా శిక్షకులు, ఏలిగెటి కృష్ణ

సిరిసిల్ల టౌన్, ముద్ర: దసరా సెలవుల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, యోగా శిక్షకులు ఏలిగెటి కృష్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ లో ఆదివారం నుంచి ఈ నెల 20 వ తేదీ వరకూ ఉచిత  యోగ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏలిగెటి కృష్ణ తెలిపారు. ఉదయం 06.15 గంటల నుంచి ఉదయం 07.45 గంటల వరకు గంటన్నర సేపు నిర్వహించే యోగా శిక్షణలో భాగంగా విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించే యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వ్యక్తిత్వ వికాసం, ఆటలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల చిన్నారులు, విద్యార్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.