భువనగిరి కాంగ్రెస్ టికెట్ పై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ..

భువనగిరి కాంగ్రెస్ టికెట్ పై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ..
  • మొదటి జాబితాలో భువనగిరి అభ్యర్థి పేరు లేకపోవడం..
  • ఉత్కంఠ రేపుతున్న భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్..
  • బీసీ వర్గానికి కేటాయించాలని కోరిన ఎంపీ..
  • కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని సూచించారు..

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి కాంగ్రెస్ టికెట్ పై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం  55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల  విడుదల చేయడంతో అందులో భువనగిరి  కాంగ్రెస్ అభ్యర్థి  పేరు  లేకపోవడంతో ఉత్కంఠ రేపుతోంది. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ బీసీ వర్గానికి కేటాయించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరినట్లు సమాచారం. కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎంపిక అవకాశం ఇవ్వాలని సూచించినట్టు చర్చించుకుంటున్నారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన  పంజాల రామాంజనేయులు గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ వచ్చే అవకాశం ఉందని కొందరు మరి కొంతమంది కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయమన్నది అధిష్టానమని మరికొంతమంది పార్టీ వర్గాల్లో చర్చ. ఇద్దరు కలిసి పోతేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, లేకుంటే నష్టం జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్న పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కుంభ అనిల్ కు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. కుంభం అనిల్ కుమార్ రెడ్డి  పార్టీ నుండి వెళ్లి పోవడమే చేసిన తప్పుగా కొందరు సీనియర్ నాయకులు అధిష్టానం ముందు తెలపడం జరిగిందని తెలుస్తోంది.